PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 3:17 pm Posted by : PORU TELANGANA

వినాయక నిమర్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి

మంచిర్యాల్
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

సెప్టెంబర్ 23, 2026:
వినాయక నవరాత్రుల అనంతరం నిర్వహించే నిమర్జన కార్యక్రమాన్ని సామరస్యంతో, ప్రశాంత వాతావరణంలో సజావుగా జరుపుకోవాలని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని దండేపల్లి మండలం గూడెంలో నిమజ్జన ప్రాంతాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్, ఎస్ ఐ లతో కలిసి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, నిమజ్జన ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని తెలిపారు

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.