బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం.. నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి.. రేగడి మద్దికుంట లో ఇంజనీరింగ్ విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లక్ష్మణ్ కుమార్

బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఔట్సోర్సింగ్ ఉద్యోగం ప్రభుత్వ విఫ్ విజయ రమణారావు పెద్దపల్లి//ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థికి పురుగుల మందు తాగించి అతి దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామంలో అమృత రాణి కుటుంబాన్ని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, రామగుండం...