PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 9:47 am Posted by : srinivaskadarisrinivaskadari0@gmail.com

అటవీ ప్రాంతంలో అరుదైన నీలి రంగు పుట్టగొడుగు.

సిర్పూర్ (టీ) అక్టోబర్ 01:

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌(టి) అటవీ డివిజన్‌ పరిధిలోని మాకిడి నెక్షన్‌, గొల్యాల్‌ అటవీ ప్రాంతంలో అరుదైన నీలిరంగు పుట్టగొడుగు కనిపించింది. ఎంటోలోమా హోచెట్టరీ లేదా ‘బ్లూ పింక్ గిల్‌’గా పిలిచే ఈ జాతి సాధారణంగా న్యూజిలాండ్‌ అడవుల్లో కనిపిస్తుందని అధికారి మోహన్‌రావు తెలిపారు. అజులిన్‌ వర్ణద్రవ్యం కారణంగా నీలిరంగులో ఉంటాయని, తెలంగాణ అడవుల్లో కనిపించడం జీవ వైవిధ్యానికి నిదర్శనమన్నారు. ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ వీటిని తినకూడదని హెచ్చరించారు.