కొండపల్లిలో 1000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం.ఒకరిపై కేసు నమోదు. 5 లీటర్ల గుడుంబా స్వాధీనం.

పోరు తెలంగాణ అక్టోబర్: 28: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.అక్రమంగా గుడుంబా తయారీ, విక్రయాల నియంత్రణలో భాగంగా పోలీసులు నిర్వహించిన కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ కార్యక్రమంలో 1000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పెంచికల్‌పేట్‌ మండలం కొండపల్లి గ్రామంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.ఎస్సై అనిల్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.గ్రామంలో నిర్వహించిన కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ కార్యక్రమంలో భాగంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన 1000...