గాంధీ జయంతి సందర్భంగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టిన సిర్పూర్ శాసనసభ్యులు
పోరు తెలంగాణ అక్టోబర్ 02 : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మున్సిపల్ సిబ్బంది, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి "క్లీన్ అండ్ గ్రీన్" డ్రైవ్ నిర్వహించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.ఈ సందర్భంగా వారు అక్కడి మరుగుదొడ్లను శుభ్రం చేశారు . పరిసరాలను ప్రజలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. బస్టాండ్ ఆవరణలో పూర్తిగా చెత్తను తొలగించి చెట్లు నాటడం జరిగింది. అనంతరం గాంధీజీ చిత్రపటానికి పూల...