గోయగంలో మిషన్ అమృత్ జల్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభం.కిడ్నీ సమస్యల నివారణకు శుద్ధి చేసిన తాగునీరు.

పోరు తెలంగాణ అక్టోబర్ 27: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కెరమెరి మండలం గోయగం గ్రామంలో మిషన్ అమృత్ జల్ పైలట్ ప్రాజెక్టును మంత్రి సీతక్క సోమవారం ప్రారంభించారు. జోడేఘాట్‌లో జరిగిన కొమురం భీమ్ వర్ధంతి కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న మార్గంలో ఆమె ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రాజెక్టు ఉద్దేశాన్ని జిల్లా కలెక్టర్ కె. హరిత మంత్రికి వివరించారు. గోయగం గ్రామంలో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు వంటి సమస్యలు గుర్తించామని తెలిపారు. ఈ గ్రామంతో పాటు మరికొన్ని గ్రామాల ప్రజలు గత...