జగిత్యాల: సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం: పొన్నం

  జగిత్యాల: రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జగిత్యాలలో ఆదివారం ఆయన మాట్లాడుతూనే.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, పెట్టు బడి సాయం పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, పాది ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తున్నదన్నారు.