PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 5:49 am Posted by : srinivaskadarisrinivaskadari0@gmail.com

బారెగూడ గ్రామపంచాయతీలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

పోరు తెలంగాణ అక్టోబర్ 02:

గాంధీ జయంతి సందర్భంగా కాగజ్ నగర్ మండలం బారెగూడ గ్రామ పంచాయతీలో నిర్వహించిన వేడుకల్లో సర్పంచ్ కోట వేణుగోపాల్ పాల్గొని మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామసభను నిర్వహించారు.ఈ  సందర్భంగా సర్పంచ్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని సాకారం చేసుకునే దిశగా బారెగూడ గ్రామం ముందుకు సాగుతోందని తెలిపారు. గ్రామ అభివృద్ధి అనేది ఒక్కరి బాధ్యత కాదని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐక్యంగా కలిసి పనిచేసినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామంలోని సమస్యలను పరిష్కరించుకుంటూ, పరిశుభ్రత, పచ్చదనం, మౌలిక వసతులు, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ బారెగూడను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, అన్ని శాఖల సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.