రహదారుల శుభ్రత,పాఠశాల వద్ద మొక్కలు నాటిన సర్పంచ్ బాపూజీ
వాంకిడి అక్టోబర్ 01: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామపంచాయతీ పరిధిలో పరిశుభ్రత, పచ్చదనం పెంపునకు సర్పంచ్ మొహార్లే బాపూజీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. గ్రామంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రహదారులపై పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించే కార్యక్రమం చేపట్టారు.రహదారులపై ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని, నిర్ణీత ప్రదేశాల్లోనే వేయాలని ఆయన సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. రహదారులు, వీధులు, ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో పారిశుధ్య సిబ్బందితో క్రమం తప్పకుండా...