ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జోన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి,పొగాకు ఉత్పత్తులు తదితర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య,మానసిక, సామాజిక దుష్పరిణామాలను విద్యార్థులకు వివరించారు.మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటికి ఆకర్షితులై తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు.మత్తు పదార్థాల అక్రమ విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన...