జాతిపిత గాంధీ సిద్ధాంతాలు సమాజానికి మార్గదర్శకం : జిల్లా కలెక్టర్ అంకిత్
కొత్తగూడెం అక్టోబర్ 2 పోరు తెలంగాణ జిల్లా ప్రతినిధి కూరపాటి దాసు జాతిపిత మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాల్లో ప్రతి ఒక్కరూ పయనించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో కలిసి పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల్లో అగ్రగణ్యుడైన మహాత్మా గాంధీజీ సత్యాగ్రహం, అహింసాయుత...