కొత్తగూడెం సెప్టెంబర్ 2 పోరు తెలంగాణ జిల్లా ప్రతినిధి కూరపాటి దాసు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది సైతం గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గాంధీజీ సత్యం, అహింసా మార్గాలు దేశ ప్రజలకు ఆదర్శం అని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఇంద్రసేనారెడ్డి, కరుణాకర్, ఆర్‌ఐలు సుధాకర్, రవి, లాల్ బాబు, కృష్ణారావు, ట్రాఫిక్ ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.