ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు*

కొత్తగూడెం సెప్టెంబర్ 2 పోరు తెలంగాణ జిల్లా ప్రతినిధి కూరపాటి దాసు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది సైతం గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గాంధీజీ సత్యం, అహింసా మార్గాలు దేశ ప్రజలకు ఆదర్శం అని పేర్కొన్నారు....