హిమాచల్ ప్రదేశ్ లోని మౌంట్ తరంగ్ 2 పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన గురుకుల విద్యార్థి 6,027 మీటర్ల ఎత్తైన మౌంట్ అవలీలగా అధిరోహించిన ఇస్లావత్ బన్నీ తొలి భారతీయ బృందంలో చోటు.. విద్యార్థిని అభినందించిన సంక్షేమ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
హైదరాబాద్, అక్టోబరు 3: సంకల్పం.. క్రమశిక్షణ.. పట్టుదల ఉంటే ఎంతటి ఎత్తయిన లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని తెలంగాణ గిరిజన గురుకుల విద్యార్థి ఇస్లావత్ బన్నీ నిరూపించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని 6,027 మీటర్ల (19,774 అడుగుల) ఎత్తైన మౌంట్ తరంగ్-2 శిఖరాన్ని అధిరోహించి చారిత్రక ఘనత సాధించారు. తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల (TGTWRDC), కామారెడ్డిలో బీకాం చివరి సంవత్సరం చదువుతున్న బన్నీ ఈ నెల 22న అధిరోహించారు. సెప్టెంబరు 30న తిరిగి తిరిగి సురక్షితంగా వచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ...