ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయడానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఒప్పందం చేసుకున్న జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థలు హరేకృష్ణ ఫౌండేషన్
హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు, జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి నీ జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లలో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు ఈ రెండు సంస్థలు హరేకృష్ణ ఫౌండేషన్ కు సహకారం అందిస్తాయి. నాగర్‌కర్నూల్‌లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కోసం జున్నా సోలార్ సిస్టమ్స్ సంస్థ సీఎండీ శేఖర్ రెడ్డి గారు, సీఈఓ అనిల్ బాబు గారితో కలిసి రూ. 5.17 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హరే కృష్ణ ఫౌండేషన్‌కు అందించారు....