గాంధీ జయంతి సందర్భంగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టిన సిర్పూర్ శాసనసభ్యులు.

కాగజ్ నగర్ అక్టోబర్ 02: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ లో గాంధీ జయంతి సందర్భంగా కాగజ్‌నగర్ బస్టాండ్ ఆవరణలో సిర్పూర్ శాసనసభ్యుడు డా. పాల్వాయి హరీష్ బాబు "క్లీన్ అండ్ గ్రీన్" కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ సిబ్బంది, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మరుగుదొడ్లను శుభ్రం చేశారు. ఆవరణలోని చెత్తను పూర్తిగా తొలగించి చెట్లు నాటారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో స్వచ్ఛ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా కోట్లాది ఇళ్లకు...