బారెగూడ గ్రామపంచాయతీలో ఘనంగా మహాత్మా గాంధీజీ జయంతి వేడుకలు.

పోరు తెలంగాణ అక్టోబర్ 02: గాంధీ జయంతి సందర్భంగా కాగజ్ నగర్ మండలం బారెగూడ గ్రామ పంచాయతీలో నిర్వహించిన వేడుకల్లో సర్పంచ్ కోట వేణుగోపాల్ పాల్గొని మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని సాకారం చేసుకునే దిశగా బారెగూడ గ్రామం ముందుకు సాగుతోందని తెలిపారు. గ్రామ అభివృద్ధి అనేది ఒక్కరి బాధ్యత కాదని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐక్యంగా కలిసి...