PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 1:12 pm Posted by : PORU TELANGANA

ప్యారడైజ్ హోటల్‌కు రూ.20 వేల జరిమానా ఖైరతాబాద్ జోన్ పరిధిలోని డివిజన్-16 నగరంలో తనిఖీలు నిర్వహిస్తుండగా, ప్యారడైజ్ హోటల్‌లో భారీగా నీటి వృథాను గుర్తించిన అధికారులు.

 

హైదరాబాద్:

హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ప్యారడైజ్ హోటల్‌కు జలమండలి (HMWSSB) షాక్ ఇచ్చింది. తాగునీటిని వృథా చేసినందుకు గాను హోటల్ యాజమాన్యానికి రూ.20,000 జరిమానా విధించింది.

జలమండలి హెచ్చరిక..

భవిష్యత్తులో నీటిని పొదుపుగా వాడాలని హోటల్ యాజమాన్యానికి అధికారులు సూచించారు. నీటి వృథాకు పాల్పడితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని జలమండలి హెచ్చరించింది.