PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 8:36 pm Posted by : PORU TELANGANA

ఆర్టీసీ – మెట్రో కామన్ పాస్‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మరియు సహచర మంత్రులతో కలిసి ప్రత్యేక ప్రయాణం

హైదరాబాద్//

హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా, సమగ్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన ఆర్టీసీ – మెట్రో కామన్ పాస్‌ను ప్రజలకు చేరువ చేసే కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మరియు సహచర మంత్రులతో కలిసి ప్రత్యేక ప్రయాణం.

బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు మెట్రో రైలులో, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో సచివాలయం వరకు ప్రయాణించడం జరిగింది . ఈ సందర్భంగా ప్రయాణికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడం జరిగింది .

ఫస్ట్ మైల్ నుంచి లాస్ట్ మైల్ వరకు ప్రజలకు సులభమైన కనెక్టివిటీ అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల్లో భాగంగానే ఆర్టీసీ – మెట్రో కామన్ పాస్‌కు శ్రీకారం.

ప్రజా రవాణా వ్యవస్థపై ప్రజల అనుభవాలను నేరుగా తెలుసుకుంటూ, వారి అవసరాలకు అనుగుణంగా రవాణా సదుపాయాలను మరింత మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు 15 మంది మంత్రులకు ఆర్టీసీ – మెట్రో కామన్ పాస్‌లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు కొనుగోలు చేశారు.

ప్రజలకు సౌకర్యవంతమైన, సమగ్ర ప్రజా రవాణా వ్యవస్థను అందించేందుకు ఈ కార్యక్రమం ఒక కీలక ముందడుగుగా నిలిచింది.