ఆర్టీసీ – మెట్రో కామన్ పాస్‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మరియు సహచర మంత్రులతో కలిసి ప్రత్యేక ప్రయాణం

హైదరాబాద్// హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా, సమగ్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన ఆర్టీసీ - మెట్రో కామన్ పాస్‌ను ప్రజలకు చేరువ చేసే కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మరియు సహచర మంత్రులతో కలిసి ప్రత్యేక ప్రయాణం. బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు మెట్రో రైలులో, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో సచివాలయం వరకు ప్రయాణించడం జరిగింది . ఈ సందర్భంగా ప్రయాణికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలను అడిగి...