కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటన – బ్రాహ్మణపల్లిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన అదనపు ఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌, IPS .

అక్టోబర్‌ 4వ తేదీన బ్రాహ్మణపల్లిలో జరగనున్న అమూల్‌ మిల్క్‌ బల్క్‌ యూనిట్‌ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ VVIP పర్యటన సజావుగా జరిగేలా మెదక్ జిల్లా పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌, IPS బ్రాహ్మణపల్లిని సందర్శించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై అదనపు ఎస్పీ సూచనలు: ఏర్పాట్ల పరిశీలన: అమూల్‌ ఫ్యాక్టరీ శంకుస్థాపన ప్రదేశం, బహిరంగ సభా వేదిక, హెలిప్యాడ్‌ మరియు వీవీఐపీ...