అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మెట్పల్లి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది*. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా హాస్టల్ కన్వీనర్ మంగళపల్లి మారుతి జ్యోతి ప్రజ్వలన చేసి వారు మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థ అని 1949 జులై 9న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఢిల్లీలోని యూనివర్సిటీలో ప్రారంభమైందని అలాగే ఈ విద్యార్థి పరిషత్ ని నలుగురు విద్యార్థులతో కలిసి ప్రొఫెసర్ ఓం ప్రకాష్ బెహల్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంస్థని ప్రారంభించారని. ఈ యొక్క విద్యార్థి పరిషత్ ని స్థాపించడం యొక్క ముఖ్యమైన ఎజెండా జాతీయ పునర్నిర్మాణం మరియు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మరియు విద్యార్థుల హక్కులను కాపాడేందుకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ని స్థాపించారని ఆరోజు ఢిల్లీలో ఉన్న యూనివర్సిటీ ప్రారంభమైన ఈ సంస్థ ఈరోజు దేశవ్యాప్తంగా దేశ నలుమూలల కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇటు అటాక్ నుంచి కటక్ వరకు ప్రతి పల్లెల ప్రతి పట్నంల ప్రతి కళాశాలల ప్రతి పాఠశాలల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ పునర్నిర్మాణం కోసం మరియు విద్యార్థుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తుందని చెప్పారు మనమంతా కూడా ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో చేరి మనమందరం కూడా బాధ్యత తీసుకొని ఒక భారతీయుల మనమంతా కూడా జాతీయవాదం వైపు నడవాలని వారు కోరారు. *అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మరియు జిల్లా హాస్టల్స్ కన్వీనర్ మంగళపల్లి మారుతి నూతన నగర కార్యదర్శిగా కలికోట ప్రణీత్ ని నియమించడం జరిగింద* అలాగే సంయుక్త కార్యదర్శిగా ఆరే సాయికుమార్, బి. చరణ్, సిహెచ్.యశ్వంత్, ఆర్ వర్షిత్ లను నియమించారు. నగర ఉపాధ్యక్షులుగా: బి. బాలు, పి. విజ్ఞ సాయి, ఎండి. ఆసిఫ్, వి. యశ్పాల్ లను నియమించారు. నగర స్టూడెంట్ ఫర్ సేవ(SFS) కన్వీనర్ గా : ఏ. అన్షుల్ . కో కన్వీనర్ గా జి. అభినయ్ లను నియమించారు. స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ (SFD) కన్వీనర్ గా ఎస్. మోక్షిత్. కో కన్వీనర్ గా జె. మణిదీప్ లను నియమించారు. ఖేల్ కన్వీనర్ గా: కె. మధు. కో కన్వీనర్ గా ఎస్. హేమంత్ లను నియమించారు. నగర కార్యవర్గ సభ్యులుగా : ఏ. గణపతి, ఈ. రిత్విక్, పి. రాజు, ఎం. విష్ణు, ఏ. రామ్ చరణ్, పి. రాఘవేంద్ర, ఈ. శివరాం లను నియమించారు. అనంతరం నూతన నగర కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.