PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 11:00 am Posted by : srinivaskadarisrinivaskadari0@gmail.com

తెలంగాణ రక్షణ సేన సభ విజయవంతం చేసిన ప్రజలకు కావేటి సబిత కృతజ్ఞతలు. కవితమ్మ పై ఎమ్మెల్యే వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాం.

తెలంగాణ రక్షణ సేన సభ విజయవంతం చేసిన ప్రజలకు కావేటి సబిత కృతజ్ఞతలు.

కవితమ్మ పై ఎమ్మెల్యే వాక్యా

 

అక్టోబర్ 30న ఇంద్రవెల్లిలో నిర్వహించిన తెలంగాణ రక్షణ సేన పంచజన్య సభను విజయవంతం చేసిన ప్రజలకు సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి కావేటి సబిత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సభకు ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూసి ఓర్వలేక తమ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితపై కొందరు ఎమ్మెల్యేలు అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె మండిపడ్డారు.ముఖ్యంగా సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేగా ఆయన చేస్తున్న కృషి ఏమిటో ప్రజలకు వివరించాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయన వ్యవహారశైలిపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని, గత మున్సిపల్ ఎన్నికల సమయంలో, ప్రస్తుతం సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల సమస్య విషయంలో ఆయన వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.కవిత నాయకత్వ సామర్థ్యం, రాజకీయ అర్హతను ప్రశ్నించే స్థాయి ఎమ్మెల్యేకు లేదని సబిత పేర్కొన్నారు. కవిత ఒక ఉద్యమకారిణిగా, పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారని, సామాజిక న్యాయం లక్ష్యంగా రాజకీయాల్లో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. రాజకీయ నాయకులు పుట్టుకతో కాకుండా ప్రజా పోరాటాలు, అనుభవంతో ఎదుగుతారని పేర్కొంటూ.. ‘లీడర్స్ ఆర్ నాట్ బార్న్, లీడర్స్ ఆర్ మేడ్’ అని వ్యాఖ్యానించారు.కవితకు ప్రజల్లో ఆదరణ లేదన్న వ్యాఖ్యలను కూడా ఆమె తప్పుబట్టారు. తెలంగాణ రక్షణ సేన పేరును వక్రీకరించి ‘రాక్షస సేన’గా పేర్కొనడం బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేకు తగదన్నారు. గతంలో రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగత పరిచయంతో జరిగిన సంభాషణను రాజకీయ వివాదంగా మార్చడం సరికాదని అన్నారు. భవిష్యత్తులో తమ అధినేత్రి గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎమ్మెల్యేకు సూచించారు. పార్టీ పేరు, నాయకత్వంపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు.