PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 7:33 am Posted by : srinivaskadarisrinivaskadari0@gmail.com

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి కవేటి సబిత మనోహర్.

కాగజ్‌నగర్‌లో వివాహ వేడుకకు హాజరు.. మహారాజ సభను సందర్శన….

 

పోరు తెలంగాణ నవంబర్ 15: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కాగజ్‌నగర్: టీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి కవేటి సబిత మనోహర్ సోమవారం కాగజ్‌నగర్ పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని పటేల్ గార్డెన్స్‌లో నిర్వహించిన సిందం స్వప్న–సుధాకర్ కుమార్తె స్నికిత, అఖిల్ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను కలిసి పుష్పగుచ్ఛం అందించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్లు (ఎస్‌పీఎం) గ్రౌండ్‌లో సోమవారం నిర్వహించిన మహారాజ సభను సందర్శించారు. సభ నిర్వాహకులను, అక్కడ పాల్గొన్న వారిని కలిసి కార్యక్రమ వివరాలను తెలుసుకున్నారు.