PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 10:56 am Posted by : srinivaskadarisrinivaskadari0@gmail.com

పీఎం జన్మన్ ఇళ్ల సమావేశాన్ని విజయవంతం చేయాలి.కోలాం తోటి ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరుకావాలి.

 

పోరు తెలంగాణ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 16:

ఆసిఫాబాద్: పీఎం జన్మన్ పథకం కింద ఇళ్ల మంజూరు, సంబంధిత సమస్యలపై చర్చించేందుకు మంగళవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని సమీకృత భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి, కోలాం తోటి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సీడం నాగోరావు తెలిపారు. ఈ సమావేశానికి కోలాం తోటి తెగకు చెందిన ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పీఎం జన్మన్ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్ల సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.కావున కోలాం తోటి కులస్తులు, ప్రజాప్రతినిధులు, సంఘం నాయకులు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి హాజరై తమ వంతు సహకారం అందించాలని సీడం నాగోరావు కోరారు.