ప్రధాన నాలాను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు.. సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు

పోరు తెలంగాణ నవంబర్ 02: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.కాగజ్‌నగర్ మండలంలోని బోరిగాం శివారులో ఉన్న ప్రధాన నాలాను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొన్న రమేష్ కోరుతూ కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్‌కు నవంబర్ 2న ఫిర్యాదు అందజేశారు. కాగజ్‌నగర్ మండల పరిధిలోని ఎన్‌జీవో కాలనీ గ్రామపంచాయతీ పరిధిలో, మధుర హాస్పిటల్ పక్కన సర్వే నంబర్ 144/1లో ప్రధాన నాలాను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోకి వెళ్లే ప్రధాన రహదారిని...