మల్లంపేట గ్రామపంచాయతీలో ఘనంగా బాలల దినోత్సవం
కోటపల్లి మండలం లోని మల్లంపేట గ్రామ పంచాయతీ లో బాలల దినోత్సవ వేడుకలను విద్యార్థులు ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ సందర్బంగా సర్పంచ్ తాళ్ల వెంకటమ్మ -బాపు మాట్లాడుతూ పిల్లలతో ప్రతి ఒక్కరు మంచిగా చదువుకోవాలని పిల్లలే దేశ భవిష్యత్తు అని విద్యార్థులు క్రమశిక్షణ మంచి నడవడిక పట్టు దలతో చదువు కొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఆటపాటలలో నైపుణ్యత ఉండాలని ఎంతో ఎత్తుకు ఎదగాలని గ్రామంలో బాల్యవివాహలను జరగకుండా చూసుకోవాలని తెలిపారు.పిల్లల విద్య...