సంగారెడ్డిలో ఏసీబీ వలకు చిక్కిన వ్యవసాయ అధికారి.. రూ.20 వేల లంచం తీసుకుంటూ అరెస్ట్

  సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల వ్యవసాయ అధికారి జి. రమేష్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎరువుల వ్యాపారం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు ఫిర్యాదుదారుడి అల్లుడి నుంచి మొత్తం రూ.30 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఇప్పటికే అక్టోబర్ 19న రూ.10 వేలు తీసుకున్న అధికారి, మిగిలిన రూ.20 వేలు నవంబర్ 3న తన కార్యాలయంలో తీసుకుంటుండగా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి రూ.20 వేల నగదును స్వాధీనం...