PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 11:12 am Posted by : PORU TELANGANA

అక్రమంగా నిల్వ ఉంచిన 6 క్వింటాళ్ల పీడీఎస్ సన్నబియ్యం పట్టివేత… జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్ తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్న వ్యక్తిపై 6-A, క్రిమినల్ కేసు నమోదు

అక్రమంగా నిల్వ ఉంచిన 6 క్వింటాళ్ల పీడీఎస్ సన్నబియ్యం పట్టివేత… జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్

 

తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్న వ్యక్తిపై 6-A, క్రిమినల్ కేసు నమోదు

పెద్దపల్లి//అక్రమంగా నిల్వ ఉంచిన 6 క్వింటాళ్ల పీడీఎస్ సన్నబియ్యం పట్టుకున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్ తెలిపారు. జిల్లా పౌరసరఫరాల అధికారి కె. శ్రీనాథ్ ఆధ్వర్యంలో సోమవారం పౌరసరఫరాల శాఖ అధికారులు పెద్దపల్లి పట్టణంలోని సాగర్ రోడ్‌లో గల ఇంటి నంబర్ 3-3-136/A/1లో తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా సరఫరా చేసే సన్నబియ్యాన్ని ప్యాకేజీ బ్యాగుల్లో నింపుతున్న బజ్జూరి శంకర్, తండ్రి రాములును అధికారులు పట్టుకున్నారు.

ఈ సందర్భంగా 23 బ్యాగుల్లో ఉన్న మొత్తం 6 క్వింటాళ్ల పీడీఎస్ సన్నబియ్యాన్ని స్వాధీనం చేసుకుని, భద్రత నిమిత్తం ఎంఎల్ఎస్ పాయింట్‌కు అప్పగించారు.

పీడీఎస్ సన్నబియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు బజ్జూరి శంకర్‌పై 6-A కేసుతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేశారు.ఈ తనిఖీల్లో పోచయ్య (DTCS), రాజిరెడ్డి (CSI), శ్రీనివాస్ (ETF కానిస్టేబుల్) పాల్గొన్నారు.