రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా అందాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ శాఖల్లో అమలవుతున్న బీమా పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సూచిoచన ఎ రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఈ నెల 19న సిద్దిపేట బహిరంగ సభలో ఇందిరమ్మ బీమా దరఖాస్తుల స్వీకరణను ముఖ్యమంత్రి గారు ప్రారంభించనున్న నేపథ్యంలో ఇందిరమ్మ బీమా, ఇందిరమ్మ చీరల పంపిణీపై జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇందిరమ్మ బీమా పథకం అమలు కావాలని, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. బీమా పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఈ బీమా వల్ల ఉపాధి హామీ కూలీలతో...