*అర్హులైన ప్రతి ఒక్కరికి చేయూత పింఛన్లు..* *సదరం సర్టిఫికెట్ల జారీలో అధికారు లు ప్రత్యేక చొరవ చూపాలి..* *రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..* *మెట్ పల్లి లో చేయూత పింఛన్లు మంజూరు పత్రాలు అందజేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
/మెట్ పల్లి టిఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత చేస్తున్న ఆరోపణలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గానికి నూతనంగా మంజూరు అయిన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మెట్ పల్లి లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరు కాగా కోరుట్ల ఎమ్మెల్యే...