PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 8:11 pm Posted by : PORU TELANGANA

సిద్దిపేట జిల్లాలో రూ. 544.11 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి

సిద్దిపేట జిల్లాలో రూ. 544.11 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి

మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి రోజున ప్రజాపాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఈ అభివృద్ధి పనులను ప్రారంభించారు.

శంకుస్థాపనల వివరాలు:

దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో ఒక్కోచోట రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం.

జిల్లాలోని ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో రూ. 15.44 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణం.

రూ. 13.50 కోట్లతో ఆరు తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణం.

చిన్నకోడూరు మండలంలో రూ. 7.50 కోట్లతో, దౌల్తాబాద్ మండలంలో రూ. 7.80 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణం.

జనగామ నియోజకవర్గంలో రూ. 6.89 కోట్లతో మూడు విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం.

▶️ప్రారంభోత్సవాల వివరాలు:

సిద్ధిపేట జిల్లాలో రూ. 54.67 కోట్లతో నిర్మించిన 14 విద్యుత్ సబ్ స్టేషన్లు.

కొమురవెల్లి మల్లన్న ఆలయంలో రూ. 14.35 కోట్లతో నిర్మించిన వసతి సత్రం, రూ. 12 కోట్లతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్.

రూ. 6.50 కోట్లతో నిర్మించిన 53 గ్రామ మహిళా సంఘాల భవనాలు.

రాయపోల్ మండలంలో రూ. 3.87 కోట్లతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవనం.
గజ్వేల్‌లో రూ. 1.59 కోట్లతో నిర్మించిన విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం.