ఆధారిత వ్యాపారాలకు అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్ * ఐక్యరాజ్యసమితి (ఐరాస) వేదికగా 1M1B సంస్థ నిర్వహించిన గ్లోబల్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఈరోజు ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్, ఏఐ, అధునాతన తయారీ రంగాల్లో ఉన్న అవకాశాలను అంతర్జాతీయ ప్రతినిధులకు ఈ సందర్భంగా మంత్రి ఈ సందర్భంగా వివరించారు. * తెలంగాణ ఇప్పటికే ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో అంతర్జాతీయ గుర్తింపు సాధించిందని, ప్రస్తుతం ఏఐ, అధునాతన తయారీ సహా నూతన సాంకేతిక రంగాల్లోనూ వేగంగా విస్తరిస్తోందని మంత్రి అన్నారు. ప్రతిభావంతులైన యువత, పరిశ్రమలకు అనుకూలమైన...