PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 22 November 2026, 8:01 am Posted by : PORU TELANGANA

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం..విద్యుత్ ఏ డి ఈ శంకర్..

మహేశ్వరం, నవంబర్ 21, పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి:

నేడు మహేశ్వరం మండల పరిధిలోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ ఏ డి ఈ శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. నేడు ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఫ్యాబ్ సిటీ సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా ప్రీమియర్, మలబార్ గోల్డ్, విప్రో, ఇమామ్ గూడ, శ్రీనగర్, బి టి ఆర్, పెద్దమ్మ టెంపుల్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల విద్యుత్ వినియోగదారులు విద్యుత్ అధికారులకు సహకరించగలరని ఆయన ఒక ప్రకటనలో కోరారు.