PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 2:22 pm Posted by : PORU TELANGANA

అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి.. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి..

మహేశ్వరం, నవంబర్ 16, పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి:

అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. సోమవారం జల్ పల్లి సర్కిల్, షాహిన్ నగర్ డివిజన్ పరిధిలోని అబు బాకర్ కాలనీ, క్యూబా కాలనీ 95 లక్షలతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. కాలనీలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజా సమస్యల పరిష్కారానికే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.