ప్రభుత్వ పథకాలను అధికారులు సమర్ధవంతంగా అమలు చేయాలి

Date:

Share post:

📰 Generate e-Paper Clip

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

సెప్టెంబర్ 29, 2026:
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన పథకాలను అధికారులు సమన్వయంతో పనిచేసి సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు, బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్ మనోజ్, జిల్లా రెవెన్యూ అధికారి మోతీరామ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎ.డి. శ్రీనివాస్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు లతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, రీ-సర్వే, సాదాబైనామా, 22-ఎ, భూభారతి, రెవెన్యూ సదస్సులు, ప్రజావాణి, కళ్యాణలక్ష్మి – షాదిముబారక్, కోర్టు కేసులు, ఆర్ & ఆర్ చట్టం, ఇసుక, భూసేకరణ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు సంబంధించిన రెవెన్యూ సమస్యల పరిష్కారం, పెండింగ్‌ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశిత గడువులోగా పరిష్కార చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎస్.ఐ.ఆర్. ప్రక్రియకు సంబంధించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేయడంతో పాటు, రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. సాదాబైనామా దరఖాస్తులు, 22-ఎ కు సంబంధించిన భూ సమస్యలు, భూభారతి ద్వారా అందుతున్న దరఖాస్తులు, పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ అంశాలను పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని తెలిపారు. రెవెన్యూ సదస్సులు, ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను ప్రాధాన్యతతో పరిశీలించి, అర్హత కలిగిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కోర్టు కేసులు, ప్రభుత్వానికి సంబంధించిన భూ వివాదాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, సంబంధిత రికార్డులను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. ఆర్ & ఆర్ చట్టం క్రింద పెండింగ్‌లో ఉన్న రికవరీ కేసులను సమీక్షించి, చట్టపరమైన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో ఇసుక నిర్వహణ, రవాణా సంబంధిత అంశాలపై నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, అక్రమ రవాణాకు తావు లేకుండా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. భూ సేకరణకు సంబంధించిన కేసులలో రికార్డుల పరిశీలన, పరిహారం చెల్లింపులు, పెండింగ్‌ అంశాలను వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు రెవెన్యూ సేవలు పారదర్శకంగా, సమర్థవంతంగా అందేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని, పెండింగ్‌ అంశాలను నిర్దేశిత కాలపరిమితిలో పరిష్కరించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ సమావేశంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్ రావు దేశ్‌పాండే, అన్ని విభాగాల పర్యవేక్షకులు, మండలాల తహసిల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జోన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు...

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తనిఖీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా...

జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షునిగా కాసిపేట సతీష్ కుమార్

కాంగ్రెస్గ్  పార్టీ జైపూర్ మండల సెల్ అధ్యక్షునిగా జైపూర్ మండలం నర్సింగాపూర్ (ఎస్) గ్రామానికి చెందిన కాసిపేట సతీష్ ఎన్నికయ్యారు, ఈ సందర్భంగా కాసిపేట...

అటవీ ప్రాంతంలో అరుదైన నీలి రంగు పుట్టగొడుగు.

సిర్పూర్ (టీ) అక్టోబర్ 01: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌(టి) అటవీ డివిజన్‌ పరిధిలోని మాకిడి నెక్షన్‌, గొల్యాల్‌ అటవీ ప్రాంతంలో అరుదైన నీలిరంగు పుట్టగొడుగు...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.