అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజీపల్లి గ్రామ శివారులో ఎస్సై ఎ . రాజేందర్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ప్రభుత్వ సంబంధిత శాఖల నుండి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక ట్రాక్టర్‌ను గుర్తించి పట్టుకున్నారు. విచారణలో సదరు ట్రాక్టర్ బూరుగుపల్లి గ్రామానికి చెందినదిగా గుర్తించారు. ట్రాక్టర్ డ్రైవర్/యజమాని భూక్యా చంద్రశేఖర్ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు తేలడంతో, అతనిపై సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు భీమారం ఎస్సై...