PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 2:01 pm Posted by : PORU TELANGANA

ఖమ్మం నగరపాలక సంస్థలో ఉద్యోగుల JAC ఏర్పాటు”

GMR. ఫంక్షన్ హాల్ లో ఖమ్మం నగరపాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు మరియు కార్మికుల అందరితో కలిపి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింగి. ఈ సమావేశం లో JAC ఏర్పాటు చేయడం జరిగింది. ఆ.సుధాకర్ , గారు అధ్యక్షత వహించిన ఈ సమావేశం లో ముఖ్య అతిథి గా పాల్గొన్న ఏలూరు శ్రీనివాసా రావు గారు TGO రాష్ట్ర అధ్యక్షులు మరియుTJAC సెక్రటరీ జనరల్, మాట్లాడుతూ మన హక్కులకోసం ఖమ్మం కార్పొరేషన్ లోని అన్ని విభాగాల అధికారులు , ఉద్యోగుల మరియు కార్మికులు అందరూ ఏకమై తమకు రావాల్సిన న్యాయపరమైన హక్కులకోసం కలిసి పోరాడాలని , జిల్లా , రాష్ట్ర స్థాయిలో లోని ఉద్యగ సంఘాలు అన్ని కూడా మీకు తోడుగా మీరు సాగించే ప్రతి పోరాటం లో ముందు వరసలో ఉంటాయని హామీ ఇచ్చారు. మరియు గుంటుపల్లి శ్రీనివాస రావు గారు TNGO జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఖమ్మం కార్పొరేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఈ మధ్య కాలంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉద్యోగుల హక్కుల పోరాటాలలో మీకు తోడుగా జిల్లా JAC మొత్తం ఉంటుంది అని హామీ ఇచ్చారు. ఇంకా ఈ సమావేశం లో కొణిదెన శ్రీనివాస్ గారు, TNGO జిల్లా కార్యదర్శి, మోదుగు వేలాద్రి గారు TGO జిల్లా కార్యదర్శి,ZS జైపాల్ విజయ్ కుమార్ గారు TNGO ఆర్గనైజింగ్ సెక్రటరీ, బెజ్జంకి ప్రభాకర చారి గారు TNGO నగర అధ్యక్షులు పాల్గొని కార్పొరేషన్ ఉద్యగ, కార్మికులను ఉద్దేశించి మాట్లాడినారు. ఈ సమావేశం లో ఖమ్మం నగరపాలక సంస్థలో అన్ని విభాగాల లలో పనిచేస్తున్న 500 మంది అధికారులు, ఉద్యోగులు, మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. అనంతరం KMC – JAC నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. JAC చైర్మన్ గా శ్రీ G.శ్రీనివాస రావు, JAC గౌరవ అధ్యక్షులు గా A. సుధాకర్ గారు, JAC కన్వీనర్ గా బుర్రి వెంకటేశ్వర్లు ను ఎన్నుకోవడం జరిగింది. మొత్తం 42 తో నూతన JAC కమిటీ ను ఎన్నుకోవడం జరిగినది.