PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 7:25 am Posted by : gajanandmanthri@gmail.com

చలో జోడు వాగుల శాంతియుత నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

జోడు వాగుల శాంతియుద్ధ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భీమారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పోడేటి రవి పిలుపునిచ్చాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భీమారం మండలంలోని జోడువాగుల వద్ద రోడ్డు విస్తరణ మరియు బ్రిడ్జి నిర్మాణం కోసం మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వంతో పోరాడి కోట్లాది రూపాయల నిధులను తీసుకువచ్చారు.

అయితే, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఈ పనులను ప్రారంభించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కావున
ఈ సమస్యపై ఆదివారం ఉదయం 10:30 గంటలకు జోడువాగుల వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించబడుతుంది.

కావున మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరాడు