జీవో 90 ను ఉపసంహరించుకోవాలి, బిజెపి జిల్లా అధ్యక్షుడు

 విద్యార్థులకు సంబంధించిన జీవో నంబర్ 90ను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును హౌస్ అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. జీవో ఉపసంహరణ, పెండింగ్ రీయింబర్స్మెంట్ విడుదల చేసే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.