PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 8:48 am Posted by : Siddenki Ramesh

ఫీజుల విడుదల కోసం బి జె పి లాడాయి

రాష్ట్ర ప్రభుత్వం 40 లక్షల మంది విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న 15 వేల కోట్ల రూపాయల ఫీ రీయింబర్స్ మెంట్ మరియు స్కాలర్ షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్ష కార్యక్రమంలో మంచిర్యాల నుండి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మరియు బి జె పి మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఫీ రీయింబర్స్ మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని అన్నారు. విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని రఘునాథ్ అన్నారు.