బాల్కొండ జెడ్ పి హెచ్ ఎస్ లో ప్యానల్ ఇన్స్పెక్షన్ బృందం తనిఖీ.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు, విద్యార్థుల అభ్యసన స్థాయిలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్యానల్ ఇన్‌స్పెక్షన్ బృందం బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం సందర్శించి సమగ్రంగా తనిఖీ నిర్వహించింది.నోడల్ అధికారి కే. శ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించిన ఈ తనిఖీలో ఉపాధ్యాయుల బోధనా విధానం,సిలబస్ పూర్తి చేసిన తీరు, విద్యార్థుల అభ్యసన స్థాయిలు తదితర అంశాలను బృందం పరిశీలించింది. అలాగే పాఠశాలలోని మౌలిక వసతులు,మధ్యాహ్న భోజన నాణ్యత, పాఠశాల పారిశుధ్యం, కిచెన్ గార్డెన్, ఖాన్ అకాడమీ...