చోరీ కేసుల్లో నిందితుడి అరెస్ట్… రూ.2.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం: వైరా సిఐ

జిల్లా :- తల్లాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు ఇంటి చోరీ కేసులను తల్లాడ పోలీసులు ఛేదించారని, ఈ కేసుల్లో నిందితుడిని అరెస్ట్ చేసి, చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వైరా సిఐ వెంకటప్రసాద్ తెలిపారు. రెండు ఇంటి చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న జంగాల స్వరూప్ కుమార్ ( శాంతి స్వరూప్ ) వినయ్ కుమార్, వయస్సు 41 సం,,ను శుక్రవారం ఉదయం తల్లాడ బస్ స్టాండ్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. ఏప్రిల్ 11న గంగదేవిపాడు...