*ఫరీద్‌పేట్‌లో మాజీ సర్పంచ్ హయంలో అక్రమాలపై పాల్వంచ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గృహ నిర్మాణం* *పై* **డీఎల్పీఓ విచారణ…*
*పర్మిషన్ లేకుండా గృహ నిర్మాణం చేపట్టినట్లు ఫిర్యాదు* .*
*గ్రామపంచాయతీలో అధికారుల పరిశీలన…*
పాల్వంచ, ఆగస్టు 27 (న్యూస్):
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్‌పేట్ గ్రామంలో గత మాజీ సర్పంచ్ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి, నిధుల దుర్వినియోగం, అలాగే గ్రామపంచాయతీ అనుమతులు లేకుండా చేపట్టిన గృహ నిర్మాణంపై గురువారం అధికారులు విచారణ చేపట్టారు. గత ప్రజావాణిలో అందిన ఫిర్యాదు మేరకు కామారెడ్డి డీఎల్పీఓ శ్రీనివాస్, ఎంపీఓ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో పలు అంశాలను పరిశీలించారు.
మాజీ సర్పంచ్ హయాంలో సుమారు రూ.13 లక్షల నిధుల దుర్వినియోగం జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుపై అధికారులు వివరాలు సేకరించారు. సంబంధిత రికార్డులు, పత్రాలను పరిశీలించిన అనంతరం పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తామని డీఎల్పీఓ శ్రీనివాస్ తెలిపారు.
ఇదిలా ఉండగా, పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుమారు మూడేళ్ల క్రితం నుంచి గ్రామపంచాయతీ అనుమతి లేకుండా గృహ నిర్మాణం చేపట్టినట్లు గ్రామ సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి, వార్డు సభ్యురాలు దేవోల్లా ప్రత్యూష ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై అధికారులు గ్రామపంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా, సంబంధిత గృహ నిర్మాణానికి గ్రామపంచాయతీ నుంచి ఎలాంటి అనుమతి జారీ కాలేదని కార్యదర్శి తెలిపినట్లు అధికారులు పేర్కొన్నారు.
అనుమతులు లేకుండా నిర్మించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గృహానికి వెంటనే నిబంధనల ప్రకారం అనుమతి పొందడంతో పాటు, గత మూడు సంవత్సరాలుగా చెల్లించాల్సిన ఇంటి పన్నును గ్రామపంచాయతీలో జమ చేయించాలని సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి, వార్డు సభ్యులు దేవోల్లా రాములు తదితరులు, గ్రామ ప్రజలు, యువత డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలపై అధికారులు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు కోరారు.