PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 4:24 am Posted by : PORU TELANGANA

చిలకలూరిపేటలో తెలగా, బలిజ, కాపు కళ్యాణ మండపం నిర్మాణం – 32 యూనిట్లతో స్లాబ్ పనులు పూర్తి

చిలకలూరిపేట పట్టణంలోని కృష్ణారెడ్డి డొంకలో నిర్మిస్తున్న తెలగా, బలిజ, కాపు కళ్యాణ మండపం నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా 32 యూనిట్లతో స్లాబ్ నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు దగ్గరుండి నిర్మాణ పనులను పరిశీలించారు. కళ్యాణ మండపం నిర్మాణానికి సహకరిస్తున్న దాతలకు కమిటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దాతలు అందిస్తున్న ఆర్థిక సహకారం ఎంతో విలువైనదని, వారి సహకారంతోనే నిర్మాణ పనులు దశలవారీగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ దాతలు ఇదే విధంగా సహకరించి కళ్యాణ మండప నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి తోడ్పడాలని కోరారు.