*అశ్వాపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం*
*నాడు అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డుకున్న నువ్వు… నేడు అదే అంబేద్కర్ ముందు సవాళ్లు చేయడం సిగ్గుచేటు*
*ఖబర్దార్ రేగా.. ప్రభుత్వంపై, మంత్రులపై ముఖ్యమంత్రిపై మరియు ఎమ్మెల్యే పాయం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నిన్ను నీ అనుచరులను పినపాకలో లేకుండా తరిమి కొడతాం తస్మాత్ జాగ్రత్త*
*యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్*
నాడు మల్లెలమడుగులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి అడ్డంకులు సృష్టించి, వివాదానికి కారణమైన నువ్వు, నీ అనుచరులు.. నేడు అదే అంబేద్కర్ విగ్రహం ముందు నిలబడి మా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్ మండిపడ్డారు. అసలు పంజాగుట్టలో నీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మహిళకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎటువంటి సంబంధం ఉందో ఇదే విలేకర్ల సభాముఖంగా తెలియజేయగలరా? గత 20–25 రోజులు కూడా ధైర్యంగా రాజకీయ పరిస్థితులను ఎదుర్కోలేని నువ్వు, ఇక పినపాక నియోజకవర్గ ప్రజలను ఏ విధంగా చూసుకుంటావో ప్రజలే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.ఆదివాసీ దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం వంటి ముఖ్యమైన కార్యక్రమాల్లో కనీసం జాతీయ జెండాను ఎగురవేయని నీకు నియోజకవర్గ ప్రజల గురించి, ఎమ్మెల్యే పాయం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని విమర్శించారు. ఇంకోసారి మా ప్రభుత్వంపై, మంత్రులపై ముఖ్యమంత్రిపై స్థానిక ఎమ్మెల్యే పాయంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నిన్ను నీ అనుచరులను పినపాకలో లేకుండా తరిమి కొడతాం తస్మాత్ జాగ్రత్త.. ఇకనైనా నీ అనుచరులు ఉందాతనంగా రాజకీయం చేస్తే బాగుంటుందని అలాగే నీపై ఒక మహిళ చేసిన ఫిర్యాదుకు సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆ కేసులో కోర్టు నుంచి నీకు ఊరట లభించినంత మాత్రాన అన్ని విమర్శలకు అతీతుడివని భావించుకోవడం సరికాదన్నారు. కోర్టు తీర్పును గౌరవిస్తూనే, రాజకీయంగా నీ గత వైఖరిపై ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉందని పేర్కొన్నారు.నాడు మల్లెలమడుగులో అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించి, నీ అనుచరులతో వివాదానికి కారణమైన నువ్వు.. నేడు అదే అంబేద్కర్ విగ్రహం ముందు నిలబడి అమాయకుడిలా మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారిపై నువ్వు, నీ అనుచరులు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇకపై సహించేది లేదని హెచ్చరించారు. రాజకీయ విమర్శలు చేయాలంటే ప్రజాస్వామ్య పద్ధతిలో, హుందాగా చేయాలని సూచించారు. 2028–29 ఎన్నికల్లో పినపాక నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేసే రాజకీయ బలం, ప్రజల విశ్వాసం నీకు ఉందా? అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నుంచి గుణపాఠం నేర్చుకోవాలని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు మరింత స్పష్టమైన తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడటం, నీ అనుచరులతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయించడం వల్ల రాజకీయ స్థాయి పెరగదని హితవు పలికారు. పినపాక నియోజకవర్గ ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, సరైన సమయంలో ప్రజలే తగిన సమాధానం చెబుతారని యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్ స్పష్టం చేశారు.