PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 8:02 pm Posted by : PORU TELANGANA

చిన్న మొత్తాల పొదుపు ఏజెంట్ చారుగుండ్ల వి ఎల్ నరసింహారావుకు ఘన సన్మానం

ఖమ్మం జిల్లా, మధిర పోస్టల్ సబ్ డివిజనల్ పరిధిలో మధిర శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పోస్టల్ ఇన్స్పెక్టర్ కోటేష్ గారి ఆధ్వర్యంలో అవార్డు ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఖమ్మం పోస్టల్ సూపర్నెంట్ వి వీరభద్ర స్వామి విచ్చేసినారు. మధిర ఎస్ఓ, మధిర బజార్ ఎస్ ఓ, ఎర్రుపాలెం ఎస్ ఓ, బనిగళ్ళ పాడు ఎస్ ఓ, సిరిపురం ఎస్ ఓ, బోనకల్లు ఎస్ ఓ పరిధిలో అత్యధిక వ్యాపారం చేసిన పోస్టల్ సిబ్బందికి మరియు ఏజెంట్లకి ఘన సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మధిర పట్టణంలో గత 36 సంవత్సరాల నుంచి చిన్న మొత్తాల పొదుపు ఏజెంట్గా పని చేస్తూ అత్యధిక వ్యాపారం చేసిన చారుగుండ్ల వి ఎల్ నరసింహారావుకు ఖమ్మం సూపర్నెంట్ వి వీరభద్ర స్వామి, పోస్టల్ ఇన్స్పెక్టర్ కోటేష్ గారిచే అప్రిషియేషన్ సర్టిఫికెట్, మెమెంటో మరియు దుశాల్వాతో ఘన సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బంధుమిత్రులు, ఖాతాదారులు నరసింహారావు ను అభినందించడం జరిగింది.