PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 8:30 am Posted by : PORU TELANGANA

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి :- ఎంపీడీవో వీణ.

భీమారం మండలం, ధర్మారం గ్రామపంచాయతీలో ఎంపీడీవో వీణ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని (మిడ్ డే మీల్స్) తనిఖీ చేసి, భోజనం నాణ్యత, పరిశుభ్రత, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.

అనంతరం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని అధికారులు, ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ధర్మారం గ్రామ సర్పంచ్ దాసరి మణిదీపక్ భీమారం మండల ఎంపీడీఓ వీణ ఎంపీఓ సతీష్ రెడ్డి ఏపీవో జీనత్ , పంచాయతీ కార్యదర్శి శ్రావణ్, మాజీ సర్పంచ్ మధునయ్య తదితరులు పాల్గొన్నారు.