విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి :- ఎంపీడీవో వీణ.

భీమారం మండలం, ధర్మారం గ్రామపంచాయతీలో ఎంపీడీవో వీణ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని (మిడ్ డే మీల్స్) తనిఖీ చేసి, భోజనం నాణ్యత, పరిశుభ్రత, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. అనంతరం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని అధికారులు, ప్రజలకు...