పోరు తెలంగాణ డిజిటల్ డెస్క్ :- మెట్ పల్లి పట్టణంలోని ఏకలవ్యనగర్‌లో ప్రేమ పేరుతో వంచించి పెళ్ళికి నిరాకరిస్తున్న యువకుని ఇంటిముందు గత రెండు రోజులుగా యువతి బైఠాయించారు.ఈ సందర్బంగా మాట్లాడతూ…ఏకలవ్యనగర్‌కు చెందిన అంగడి శిరీష అనే యువతీ అదే కాలనీ కి చెందిన పాలకుర్తి సతీష్ గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నప్పటికీ సతీష్ పెళ్లికి నిరాకరిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.సతీష్ విదేశాలకువెళ్లి తిరిగి వచ్చిన తర్వాత తనను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చాడని,తనకు వచ్చిన వివాహ సంబంధాలను సైతం తిరస్కరించాలని మాయ మాటలతో నమ్మించి ప్రస్తుతం పెళ్లికి నిరాకరిస్తున్నాడని రెండు రోజుల క్రితం ఇంటికి వెళ్లి నిలదీయగా వారి కుటుంబ సభ్యులతో కలిసి తనపై దాడి చేసి గాయపరచారన్నారు. మెట్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవట్లేదని యువతి ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో తనకు న్యాయం చేయాలంటూ శనివారం నుండి సతీష్ ఇంటి ఎదుట బైఠాయించగా ప్రియుని కుటుంబ సభ్యులు ఇల్లుకు తాళం వేసి పారిపోయారని తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని స్పష్టం చేశారు.అటు తన కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానివ్వడం లేదని,ఇటు ప్రియుని కుటుంబ సభ్యులు రానివ్వడం లేదంటూ తనకు చావే శరణ్యమని శిరీష తెలిపారు.